AP: తాను క్లీన్ చిట్‌తో మళ్లీ నేషనల్ హైవేలా దూసుకెళ్తానని కిరణ్ రాయల్ తెలిపారు. తాను మంచోడిని కాబట్టే నిలబడ్డా అని, వేరే వాళ్ళైతే ఆత్మహత్య చేసుకునేవారని అన్నారు. తనపై చేసిన కుట్రలను ఆధారాలతో సహా పవన్ కళ్యాణ్ ముందు ఉంచుతానని అన్నారు. తనకు, లక్ష్మిరెడ్డికి కేవలం ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయని, తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. వైసీపీలో రాసలీలల రాజలు చాలామందే ఉన్నారని, వారు నిజాయితీ పరులా అని కిరణ్ ప్రశ్నించారు.