ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగులు నెలలో కనీసం 10 రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలనే ఆదేశాలను జారీచేసింది. ఎవరైనా 10 రోజులు ఆఫీసుకు రానట్లయితే.. వారిని ఉద్యోగుల సెలవుల బ్యాలెన్స్ నుంచి తీసివేయనుంది. ఈ కొత్త రూల్ మార్చి 10 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది లెవెల్ 5, అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులకు వర్తించనుంది.