తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ప్రభుత్వ ముఖ్య సలహాదారునిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గురువారం జానారెడ్డితో భేటీ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం జానారెడ్డి ఇంటికి సీఎం భోజనానికి వెళ్లారు. తన సూచనలు తీసుకుంటే ఇస్తానని జానారెడ్డి రెండు రోజుల క్రితమే గాంధీభవన్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జానారెడ్డికి కీలక పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.