TG: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం జానకీపురంలో రైతులు నిరసనకు దిగారు. పొలాలకు నీళ్లు ఇవ్వకుంటే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన తెలిపారు. బిక్కేరువాగులోకి నీళ్లు వదిలితేనే పంటలు చేతికి వస్తాయని, లేకుంటే తమకు చావే శరణ్యమని అన్నారు. గ్రామంలో సుమారు వందమంది రైతులకు చెందిన దాదాపు 200 ఎకరాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.