AP: ఏపీలో వైసీపీ నేతల వరుస అరెస్టులు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ మంత్రి రోజా కాణిపాకం స్వయంభు విగ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. మాజీ కాణిపాక చైర్మన్ మోహన్ రెడ్డి, శ్రీ హరి రెడ్డి, నగరి రూరల్ ఎక్స్ కన్వీనర్ తదితరులు రోజాతో పూజలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రోజా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.