నటి తమన్నా విజయ్ వర్మతో డేటింగ్‌కు బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. కొన్ని వారాల క్రితమే విడిపోయిన ఈ ప్రేమ జంట ఇప్పుడు స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 2023లో లస్ట్ స్టోరీస్-2 సందర్భంగా వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ వార్త బయటకు వచ్చింది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వీరు బ్రేకప్ తీసుకున్నట్లు వార్తలు రావడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.