ప్రజాపాలన దరఖాస్తు పేరుతో ఓటీపీ అడిగి మోసం

195836చూసినవారు
ప్రజాపాలన దరఖాస్తు పేరుతో ఓటీపీ అడిగి మోసం
ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకుంటే ఓటీపీ చెప్పమని సైబర్ నేరగాళ్లు రూ.10 వేలు దోచేశారు. నిజామాబాద్ జిల్లా బర్థిపూర్ గ్రామానికి చెందిన లావణ్య ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు చేసుకుంది. కాగా సైబర్ నేరగాళ్లు దరఖాస్తు పేరుతో ఫోన్ చేసి ఓటీపీ అడిగి 10 వేల రూపాయలు ఖాతాలోంచి ఖాళీ చేశారు. కాగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ చెప్పకూడదని హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్