బెంగళూరులోని సెంట్రల్ యూనివర్సిటీలో శుక్రవారం రాత్రి విద్యార్థులు గొడవ పడ్డారు. చపాతీల విషయంలో ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు. మిషన్తో చేసిన చపాతీలు కావాలని నార్త్ విద్యార్థులు.. లేదు మాకు చేతితో చేసిన చపాతీలు పెట్టాలని సౌత్ విద్యార్థులు వాదనలు చేసుకున్నారు. ఈ క్రమంలో గొడవ మొదలై సౌత్, నార్త్ విద్యార్థులు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ దాడిలో అనికేత్ అనే విద్యార్థి తీవ్రంగా గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.