ఏపీలోని కూటమి ప్రభుత్వం మహిళపై వరాల జల్లు కురిపించింది. ఆదరణ-3 పథకం ద్వారా రాష్ట్రంలో 80 వేల మంది బీసీ మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే ఆహారశుద్ధి విధానంలో భాగంగా సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ట్రాన్స్‌జెండర్లకు మూలధన పెట్టుబడిలో ప్లాంటు, యంత్రాలపై 45% రాయితీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇది 35% ఉండగా.. దీన్ని 45శాతానికి పెంచారు.