ఉపాది కూలీల సమస్యలు తెలుసుకున్న నాయకులు

980చూసినవారు
ఉపాది కూలీల సమస్యలు తెలుసుకున్న నాయకులు
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్, సిఐటియు జిల్లా నాయకులు ఎస్ మల్లేష్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు హరీష్ నాయక్ ఆధ్వర్యంలో ఉపాధిహామీ కూలీల దగ్గరికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాది కూలీలు గత పది వారాలుగా పనిచేస్తున్న డబ్బులు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. రోజువారి కూలీలు 257 రూపాయలు చెల్లించాలని ఉపాధిహామీ పని చేస్తున్న ప్రదేశంలో టెంట్లు, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే గ్రామ సర్పంచ్ జితేందర్ రెడ్డి 64 మంది బాత్రూం బిల్లులను కాజేశాడని తమకు సత్వర న్యాయం జరగాలని కొందరు తమను వేడుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జూన్ 6వ తేదీన ఉపాధిహామీ కూలీల పెండింగ్ బిల్లులు కొరకై జరగబోయే ఆర్డిఓ కార్యాలయం ముట్టడికి పెద్ద ఎత్తున తరలి వచ్చి నిరసన తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూలీలు సేవ్య కస్న, శాంతమ్మ, మంగి లల్యా తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్