మానవపాడు మండలం జల్లాపురం గ్రామంలో దళిత వాడలో పైగేరిలో ఉన్న చేతి బోరు హెడ్ పూర్తిగా విరిగి పోవడంతో 6 నెలల పాటు ఉపయోగంలో లేదు.క్రింది గేరిలో ఉన్న చేతి బోరు పంపు పైపులకు రంధ్రాలు పడటంతో నీళ్లు రానందున ఈ కాలనీ వాసులు తాగటానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ప్రజావాణిలో దరఖాస్తూ ఇవ్వగా వెంటానే స్పందించి బాగు చేయించారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.