రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం చిన్నచింతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో అయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.