సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం భూత్పూర్ మున్సిపాలిటీ అమిస్తాపూర్ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే హాస్టల్ ను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే మా లక్ష్యం. మెరుగైన పౌష్టికాహారం కోసం డైట్ చార్జీలు, వ్యక్తిగత పరిశుభ్రత కోసం కాస్మెటిక్ ఛార్జీలను పెంచామని ఎమ్మెల్యే తెలిపారు.