నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు హరీష్ నాయక్ ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి వాళ్ళ కష్టాలు అడిగి తెలుసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అలాగే గర్భిణీ స్త్రీలు ఉంటారు కాబట్టి వారికి ఏర్పాటు చేసి నీళ్ల వసతి కల్పించాలని మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేసి ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడతామని కమిటీ మెంబర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకుడు నాయక్ డివైఎఫ్ఐ నాయకులు రాంలాల్, కమిటీ సభ్యులు గణేష్, కూలీలు చంద్రు సేవ్య రాంజ సుఖ్య తదితరులు పాల్గొన్నారు.