మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల నూతన తహశీల్దార్ గా బ్రహ్మం గౌడ్ మంగళవారం విధులలో చేరారు. గతంలో ఈయన మూసాపేట మండల తహశీల్దార్ గా పనిచేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. జడ్చర్లలో తహశీల్దార్ గా పనిచేసిన సత్యనారాయణ రెడ్డిపై పలు ఆరోపణలు రావడంతో శనివారం ఉన్నతాధికారులు అతనిని సస్పెండ్ చేశారు.