జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో నూతనంగా అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు గత కొంత కాలంగా జరుగుతున్నాయి. సర్వీస్ రోడ్డులో కొందరు ఇష్టానుసారంగా బైక్లను పార్కింగ్ చేయడం, చిరు వ్యాపారస్తులు రోడ్ల పైనే పూలు, కొబ్బరి బోండాలు అమ్ముతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.