అయ్యప్ప స్వామి ఆశ్శీస్సులు మనందరిపైన మెండుగా ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. శనివారం పట్టణంలోని ప్రేమ్ నగర్లో అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదానం నిర్వాహణ కోసం షెడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అయ్యప్ప స్వాములకు తాగునీటి కోసం నూతన బోరు బావికి పూజా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాములకు సేవ చేసుకొనే భాగ్యం నాకు కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు.