ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో మంగళవారం మేగా రక్తదాన శిబిరం నిర్వహించారు. చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు పలువురు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యురాలు పద్మజా రెడ్డి, సాహితీ రెడ్డి లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రక్త దానం ప్రాణదానంతో సమానమని అన్నారు.