పథకాల అమలులో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరిగిన తాను సహించేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికీ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులదేనని అన్నారు. గురువారం ప్రజాపాలన గ్రామ సభల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికి కూడా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెంకుటిళ్లు, రేకుల ఇళ్లు, గుడిసెలు కన్పిస్తున్నాయన్నారు.