పాలమురు జిల్లాను మంగళవారం పొగమంచు కమ్ముకుంది. పొగమంచు ఉండడంతో రోడ్లు సైతం కనిపించలేదు. ఉదయం 8: 00 గంటల వరకు కూడా సూర్యుడు కనిపించలేదు. పొగమంచులో వాహనదారులు సైతం రాకపోకలు సాగించడానికి ఇబ్బంది పడ్డారు. వాహనాలకు లైట్లు వేసుకుని తమ రాకపోకలు సాగించారు. మరికొందరు మాత్రం తమ వాహనాలను రోడ్డు పక్కన నిలుపుకొని మంచి తగ్గిన తర్వాత వెళ్తున్నారు. చల్లటి గాలులను తట్టుకునేందుకు చలిమంటలను వేసుకున్నారు.