మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం 230 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేసిందని, ఇంకా ఎన్నో కొత్త కొత్త పథకలు తీసుకొచ్చి మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం పనిచేస్తురన్నారు.