మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత పాలమూరు వద్ద నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనుల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా బ్రిడ్జి నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్న కారణంగా పట్టణ ప్రజలు, వాహనదారులు పలు అవస్థలు పడుతున్నారు. ఈ దారి నేషనల్ హైవే 144వైపు వెళ్ళేందుకు ఏకైక దారి కావడంతో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు.