మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఫిల్టర్ ఇసుక వ్యాపారస్తులు మైనర్ బాలురను ట్రాక్టర్ డ్రైవర్ గా నియమించుకొని, అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని పలువురు ఆరోపించారు. ట్రాక్టర్లకు కనీసం నెంబర్ ప్లేట్ కూడా లేదన్నారు. ఇసుక వ్యాపారస్తులకు 'మూడు పువ్వులు ఆరు కాయలుగా' వ్యాపారం సాగుతుందన్నారు. అధికారులు చొరవ తీసుకొని ఇసుక రవాణాను అరికట్టాలని శుక్రవారం ఆయా గ్రామాల ప్రజలు కోరారు.