కేసీఆర్ ను తిట్టడమే కాంగ్రెస్ నాయకుల పని : సింగం విజయ్ గౌడ్

65చూసినవారు
కాంగ్రెస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని కల్వకుర్తి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సింగం విజయ్ గౌడ్ దుయ్యబట్టారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని అమర వీరుల స్తూపం వద్ద రైతు రుణ మాఫీ పై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ గౌడ్ మాట్లాడుతూ సాంకేతిక కారణాలు చూపుతూ రైతుల రుణ మాఫీ పై కొర్రీలు పెట్టిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్