అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించిన మున్సిపల్ ఛైర్మ‌న్‌

565చూసినవారు
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించిన మున్సిపల్ ఛైర్మ‌న్‌
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని 13వ వార్డులో జరుగుతున్న మురికి కాలువ నిర్మాణ పనులను మున్సిప‌ల్ ఛైర్మ‌న్‌ ఎడ్మ సత్యం, కౌన్సిలర్ తలసాని సౌజన్య జనార్దన్ రెడ్డి, బాలు నాయక్ శ‌నివారం ప‌రిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ ఎడ్మ సత్యం మాట్లాడుతూ.. అభివృద్ధే లక్ష్యంగా ప్రతి వార్డ్ లో అభివృద్ధి పనులు చేయించడం జరుగుతుందని కాలనీవాసులు తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల‌ని ప్రతి ఒక్కరూ మాస్కు, శానిటైజర్ వాడాలని, కాలనీలో ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ చేయమని, ప్రతి సమస్యను త్వరలో పరిష్కరించి ప్రతి వార్డ్ అభివృద్ధి కోసం పాటుపడతానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్