కృష్ణ నది బ్రిడ్జిపై లారీ బస్ ఢీకొని వ్యక్తి మృతి

82చూసినవారు
కృష్ణ మండలం గుడేబల్లూర్ వద్ద కృష్ణ నది బ్రిడ్జిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రాయిచూర్ నుండి హైద్రాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక వైపు నుండి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో నుండి ప్రయాణికుడు ఎగిరి కిందపడి మృతి చెందాడు. మిగతా ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్