అమరచింత: అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజలు

80చూసినవారు
అమరచింత మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి భూమి పూజలు చేశారు. అనంతరం పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండేలా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. రూ. 40 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్