విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో శనివారం కామన్ డైట్ మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం కొరకు ప్రభుత్వం 40 శాతం మెస్ చార్జీలు పెంచిందని అన్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గురుకుల సిబ్బంది పాల్గొన్నారు.