ఆత్మకూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శనివారం అయ్యప్ప స్వామి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. స్వామి వారికి, ధ్వజస్థంభానికి పూజలు నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఆలయాన్ని, పరిసరాలను పరిశీలించారు. ఆలయాన్ని అద్భుతంగా కట్టించారని ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. కార్యక్రమాల్లో నాయకులు, భక్తులు, అయ్యప్ప మాలదారులు పాల్గొన్నారు.