దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ సమూల మార్పులు తెచ్చిన గొప్ప నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాల వేసి ఎమ్మెల్యే ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారన్నారు.