గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షాలతో వెల్దండ మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న వాగులు వంకలు చెక్ డ్యాంలలోకి వరద నీరు క్రమంగా చేరుకుంది. ముఖ్యంగా చెక్ డ్యామ్ లో, చెరువులు కుంటలలో జలకళ సంతరించుకుంది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు భారీగా కురిసే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఎడతెరిపి కురుస్తున్న వర్షాలకు మండల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకి రావాలని మండల తహసీల్దార్ చంద్రశేఖర్ ప్రజలకు సూచిస్తున్నారు. అదేవిధంగా మట్టి మధ్యలో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, విద్యుత్ స్తంభాల వద్దకు ప్రమాద హెచ్చరిక బోర్డులను పెట్టాలని సూచించారు.