వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్ల గ్రామానికి చెందిన మహిళ కానిస్టేబుల్ శ్రావణి కారు, లారీ ఢీకొని చనిపోయిన విషయం తెలిసిందే. గురువారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి యాపర్ల గ్రామానికి వెళ్లి శ్రావణి భౌతిక కాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విక్రమ్ గౌడ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.