వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తూడి మేఘా రెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవాలని వనపర్తి కాంగ్రెస్ సీనియర్ నేత, సమన్వయ కర్త లక్కాకుల సతీష్ మొక్కుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కానాయపల్లిలోని కోటిలింగేశ్వర దత్త ఆలయంకు రూ. 5, 00, 000/- విరాళంను ఆలయ ధర్మకర్త రుమాళ్ళమహేశ్వర్ సమక్షంలో అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి రుమాళ్ళశేఖర్, చీర్ల చందర్ పాల్గొన్నారు.