ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కాటుకు ప్రత్యేక చికిత్స

64చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కాటుకు ప్రత్యేక చికిత్స
వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పాముకాటుకు ప్రత్యేక చికిత్స సదుపాయం ఉందని గురువారం జిల్లా వైద్యాధికారి జయ చంద్రమోహన్ తెలిపారు. వనపర్తిలో మాట్లాడుతూ. గోపాల్పేట మండలం ఏదులకు చెందిన బాలమ్మ (65) నాగుపాము కాటుకు గురికాగా స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్ సలహాతో ఆసుపత్రిలో చేరిందని, 4రోజులు వైద్యం చేసి ప్రాణాలు కాపాడి, ఈరోజు ఊరికి పంపామన్నారు. నాటు వైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కృష్ణ సాగర్ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్