వైజాగ్ సిటీలో గంజాయి తోట.. యువకుల అరెస్ట్

84చూసినవారు
వైజాగ్ సిటీలో గంజాయి తోట.. యువకుల అరెస్ట్
విశాఖ నగరంలో గంజాయి పంట కలకలం రేపింది. కేజీహెచ్ లేడీస్ హాస్టల్ వెనుక ప్రాంతంలో కొంతమంది యువకులు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి పండిస్తున్నారు. సమాచారం అందుకున్న విశాఖ వన్‌ టౌన్ పోలీసులు గంజాయి గుట్టు రట్టు చేశారు. పంటను పండిస్తున్న ఐదు మంది ముఠా సభ్యుల్లో ఒకరు మైనర్ ఉండగా మిగతా నలుగురు 20 ఏళ్లలోపు వారే ఉండడంతో షాక్‌ తిన్నారు. వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్