రాజస్థాన్‌లోని అల్వార్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ బాలిక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా దాదాపు ఎనిమిది కుక్కలు ఆమెపై ఒక్కసారిగా దాడి చేశాయి. బాలిక కేకలు వేసినా విడిచిపెట్టని కుక్కలు ఆమెను తీవ్రంగా గాయపరిచాయి.చివరికి అటుగా వెళ్లేవారు బాలికను కుక్కల నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.