ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

80చూసినవారు
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్
TGSRTC ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అమలు చేయనుంది. పల్లె వెలుగు బస్సులతో సహా అన్నింటిలోనూ ఆన్‌లైన్ పేమెంట్స్‌ విధానం అమలు చేయనుంది. దీని కోసం AFSC (ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్)ను అందుబాటులోకి తీసుకురానుంది. అంతే కాదు బస్సు పాసుల స్థానంలో డిజిటల్ కార్డులను ఇవ్వనుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్‌ను రూపొందించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్