HCU భూములను ప్రభుత్వం తీసుకోవడం లేదని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణ సెక్రటేరియట్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "దీనిపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. గందరగోళం సృష్టించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రయతినిస్తున్నాయి. వారం క్రితం HCU వీసీతో ప్రభుత్వం సంప్రదింపులు చేసింది. యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకే ఉండాలని వైస్ ఛాన్సలర్‌కి చెప్పాం." అని అన్నారు.