మేడ్చల్-మల్కాజ్ గిరి(D) గాజుల రామారంలో ప్రభుత్వ భూములను హైడ్రా రంగనాథ్ పరిశీలించారు. క్వారీ లీజులు ముగిసినా ఖాళీ చేయకుండా కబ్జాకు ప్రయత్నిస్తున్నారనే ఫిర్యాదులలో పర్యటించారు. పక్కనే ఉన్న స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ల్యాండ్ కబ్జాలు కూడా పరిశీలించారు. ఇక్కడ 400 ఎకరాల వరకూ ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాలు కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 78 ఎకరాల వరకు లీజుకు తీసుకున్న వారితో వచ్చేవారం సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు.