తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ శాఖలో 10,954 జీపీఓ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇంచ్చింది. రేవంత్ సర్కార్ ఈ మేరకు మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఇంటర్‌తో పాటు కనీసం ఐదేళ్లు వీఆర్‌వో లేదా వీఆర్‌ఏగా అనుభవం ఉన్నవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.