AP: పౌర సేవలు, పథకాలు అందుకునేందుకు ఏపీలో ప్రతి పౌరుడూ హౌస్ హోల్డ్ డేటా బేస్‌లో వివరాలు నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పౌరసేవలు, పథకాలు అందించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ శాఖలు పౌరుల వివరాలు నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అన్ని శాఖలు హౌస్ హోల్డ్ డేటా బేస్‌కు వివరాలు అనుసంధానించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రామవార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి భాస్కర్ ఉత్తర్వులు ఇచ్చారు.