ఆటో డ్రైవర్లకు భరోసా ఇచ్చిన హరీశ్ రావు (వీడియో)

61చూసినవారు
పటాన్ చెరులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఆదివారం ఆటో డ్రైవర్లు ఆవేదన చెప్పుకున్నారు. ఆర్టీసీ బస్ లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ఈఎంఐ కూడా కట్టలేక పోతున్నామని, రోడ్డుమీద పడ్డామని అన్నారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల తరుపున అసెంబ్లీలో బీఆర్ఎస్ గళం విప్పుతుందని.. ఆత్మహత్యలు వంటి తొందరపాటు నిర్ణయాలు వద్దని హరీష్ రావు సూచించారు. ప్రభుత్వం నెలకు 10 వేలు ఇచ్చేదాకా పోరాటం చేద్దామని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్