కాంగ్రెస్ పై హరీష్ రావు తీవ్ర విమర్శలు

76చూసినవారు
కాంగ్రెస్ పై హరీష్ రావు తీవ్ర విమర్శలు
ఎన్నికలు అయిపోయాయని.. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ధరలు పెంచుతుందని BRS నేత, మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. 'దొడ్డు వడ్లకు బోనస్ ఎగగొట్టింది. రేపో మాపో కరెంటు బిల్లులు పెంచుతుంది, ల్యాండ్ మార్కెట్ వాల్యూ పెంచుతుంది, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతుంది.. ఈ కాంగ్రెస్ పాలన సంక్షేమ పథకాల్లో కోతలు, పేద ప్రజల మీద బిల్లులు, ధరలు పెంచి వాతలు అన్నట్టు ఉంది' అని హరీష్ విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్