తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్రిష ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. కాగా, ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా పలు కారణాలతో వాయిదా పడింది.