డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పెందుర్తి ప్రాంతంలో JEE అడ్వాన్స్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ ఆలస్యంతో, సుమారు 30 మంది విద్యార్థులు పరీక్ష రాయలేక వెనుదిరిగారు. ఈ ఘటనతో, తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లల పరీక్ష పోవడానికి పవన్ కారణమని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.