HCU భూముల వ్యవహారంపై గురువారం జరిగిన విచారణలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలిలో ఉన్నది అసలు అటవీ భూమే కాదు అని ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదించారు. స్పందించిన ధర్మాసనం.. 'అది అటవీ భూమా కాదా అనే విషయం తర్వాత, అసలు చెట్లు నరికేయడానికి అనుమతి తీసుకున్నారా? పర్యావరణానికి జరిగే నష్టం గురించి అంచనా వేశారా? వీటన్నింటికి సమాధానం ఇవ్వాలి' అని ప్రభుత్వ CSని ఆదేశించింది.