తెలంగాణలో భారీ వర్షం (వీడియో)

53చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో ఈదుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. అమీన్‌పూర్, రామచంద్రాపురం, పటాన్ చెరు, జిన్నారం మండలాల్లో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో అంతా సేదతీరుతున్నారు. అటు జగిత్యాల పట్టణంలో ఈదురు గాలులతో మెరుపులు ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో పట్టణ రోడ్లన్నీ వర్షపు నీటితో జలమయం అయ్యాయి.

సంబంధిత పోస్ట్