ఢిల్లీలో భారీ భద్రత

66చూసినవారు
ఢిల్లీలో భారీ భద్రత
ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేయనున్న వేళ ఢిల్లీ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. దీంతో ఆ ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు దిల్లీ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పారామిలిటరీ బలగాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్లను మోహరించారు. ఇక రాష్ట్రపతి భవన్‌ లోపల, బయట మూడు అంచెల భద్రతను ఏర్పాటుచేశారు.

సంబంధిత పోస్ట్