HCU విద్యార్థులకు హీరోయిన్ ఈషా రెబ్బా మద్దతు

76చూసినవారు
HCU విద్యార్థులకు హీరోయిన్ ఈషా రెబ్బా మద్దతు
TG: HCU విద్యార్థులకు, రాష్ట్ర ప్రభుత్వానికి కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి విషయంలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఉన్న చెట్లను తొలగించడం ఆపాలని విద్యార్థులు ధర్నాలు చేపడుతున్నారు. అయితే తాజాగా తెలుగు నటి ఈషా రెబ్బా మద్దతు తెలిపారు. దీనికి సంబంధించి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఇక బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే విద్యార్థులకు మద్దతు తెలిపాయి. దీంతో ఈ వివాదం మరింత వైరల్‌గా మారుతోంది.

సంబంధిత పోస్ట్