వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా కూరగాయల ఉత్పత్తికి గణనీయమైన సవాళ్లుగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో పంటల ఉత్పత్తిపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. అయితే వాటిని ఎదుర్కొవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వేడిని తట్టుకునే వాతావరణ – స్థితిస్థాపక రకాలను సాగు చేయాలి, తక్కువ పంట కాలం కలిగిన సంకర, మెరుగైన రకాలను పండించాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.